Site icon NTV Telugu

Ester Noronha: ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్‌ కౌచ్’‌ ఉంది.. హీరోయిన్ కామెంట్స్..

Ester Noronha

Ester Noronha

Ester Noronha: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కోసం చాలామంది క్యాస్టింగ్‌ కౌచ్ లో ఇబ్బంది పడ్డామని ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తెలిపిన సందర్భాలు అనేకం. ఇదే వరుసలో తాజాగా మరో హీరోయిన్ చేరింది. తాజాగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఎస్తేర్ క్యాస్టింగ్‌ కౌచ్ పై స్పందించింది. ఆవిడ క్యాస్టింగ్‌ కౌచ్ పై కాస్త బోల్డ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆమెతో జరిగిన ఓ సినీ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్ సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడింది.

Crime News: కడప జిల్లాలో కులహంకార దాడి.. కర్రతో కొట్టి మరిగే నూనె పోశారు..

ఇందులో భాగంగా.. ఆమె క్యాస్టింగ్‌ కౌచ్ పై మాట్లాడుతూ., సినీ పరిశ్రమలో అనతి కాలంలో ఎదగాలంటే.. దానికి ఒకే ఒక షార్ట్ కట్ అంటూ తెలిపింది. సినిమా పరిశ్రమలో ఎదగడానికి ఏ పని చేయడానికి అయినా సిద్ధమైతే మాత్రమే ఎదుగుతారని.. అలాంటి వారిని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారని తెలిపింది. చిత్ర పరిశ్రమలలో క్యాస్టింగ్‌ కౌచ్ ఉందని.. సినిమా ఛాన్స్ ల కోసం ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తానని.. అనుకునేవారు ఇండస్ట్రీలో చాలానే ఉన్నారంటూ చెబుతూనే., అలాంటి వారిని చాలామంది లోపరుచుకుంటున్నారని కాస్త ఘాటుగానే తెలిపింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు కాస్త ఎక్కువయ్యాయని ఆమె తెలిపారు.

Yuvraj Singh : ఆల్‪టైమ్ ప్లేయింగ్ XI ను ప్రకటించిన యూవీ.. ధోనీకి నో ఛాన్స్..

అయితే తాను ఎప్పుడూ అలాంటి విషయాలను ఎదుర్కోలేదని తెలిపింది. అలాగే చాలామంది ట్యాలెంట్ నమ్ముకొని కూడా ముందుకు వెళ్తున్నారని.. తాను కూడా తన టాలెంట్ ను, హార్డ్ వర్క్ ను నమ్ముకొని సినీ కెరియర్ ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

Exit mobile version