Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : ఆరు గ్యారంటీల పథకాల అమలు పార్లమెంటు ఎన్నికల కోసమే

Minister Errabelli

Minister Errabelli

తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ పేర ప్రజలపై 20 వేల కోట్ల భారం మోపేల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున గార్కే, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు 420 హామీలు ఇచ్చారన్నారు.

Vijaysai Reddy: ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు..

ఆరు గ్యారంటీల పథకాల అమలు పార్లమెంటు ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పేరుతో 201 విద్యుత్ బిల్లు వచ్చిన మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో ఉచిత విద్యుత్ అమలు చేయాలని రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. LRS పై గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. ప్రభుత్వం ఏర్పడంగనే LRS పేరుతో పేద ప్రజలపై భారం ఓపెన్ అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు LRS పై కాంగ్రెస్ పార్టీ ఎత్తివేస్తానని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం సరి అయింది కాదన్నారు.

Vijaysai Reddy: ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు..

Exit mobile version