మహబూబాబాద్ జిల్లా లో ఇనుగుర్తి నూతన మండల తహశీల్దార్ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్‌లు ప్రారంభించారు. మండల కార్యాలయానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఇనుగుర్తి గ్రామానికి చిన్ననాటి నుండి నాకు అనుబంధం ఉందన్నారు. ఇనుగుర్తి చారిత్రాత్మక గ్రామమని, నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పేదల కోసం పనిచేసిన నాయకులు ఎన్టీఆర్,కేసీఆర్ లు మాత్రమేనన్నారు. కాళేశ్వరంతో సాగునీటి సమస్య తీరిందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఆడపిల్లలకు మేనమామ వలె లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని ఆయన కొనియాడారు.
Also Read : Keerthy Suresh: కేజీఎఫ్ చిత్ర నిర్మాణ బ్యానర్లో మహానటి.. మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కీర్తి సురేష్
అంతేకాకుండా.. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే ఒక్కో మోటర్ కు 80 వేల నుండి లక్ష రూపాయల బిల్లు వస్తుందని, మోటర్ల కు మీటర్లు పెట్టకపోవడంతో కేసీఆర్ పై బీజేపీ ప్రభుత్వం కక్ష్య కట్టిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఇనుగుర్తి మండలానికి వేరే పార్టీ నాయకులు వచ్చి కేసీఆర్ ను ఎవరైనా మాటలు అంటే ఉరికించి కొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇనుగుర్తి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read : Morality Police: సుదీర్ఘ నిరసనల తర్వాత దిగొచ్చిన ఇరాన్.. నైతిక పోలీసు విభాగం రద్దు
