NTV Telugu Site icon

Shyamala Rao: వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 30 లక్షల లడ్డూల విక్రయం..

Ttd

Ttd

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. 15 లక్షల మంది భక్తులు వాహన సేవలను విక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గరుడ సేవ రోజున మూడున్నర లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవను దర్శించుకున్నారని తెలిపారు. సీఎం ఆదేశాలతో బ్రహ్మోత్సవాలో భక్తులుకు మరింత మేరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. సామాన్య భక్తులుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించామని చెప్పారు. 8 రోజులలో 6 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వెల్లడించారు.

READ MORE: Pendrive: టెక్నాలజీతో క్రైమ్స్ చేయడం సులువే కానీ తప్పించుకోవడం కష్టం!

హుండీ ద్వారా 26 కోట్ల రూపాయల కానుకలు వచ్చాయన్నారు. 26 లక్షల మంది భక్తులుకు అన్నప్రసాద సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. 2.6 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. ఆర్టీసీ బస్సు ద్వారా 10 లక్షల మంది భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణించారన్నారు. శ్రీవారి ఆలయంలో 3.2 లక్షల మంది భక్తులకు నైవేద్యాన్ని ప్రసాదంగా అందించినట్లు తెలిపారు. 30 లక్షల లడ్డులను భక్తులుకు విక్రయించామని పేర్కొన్నారు. 4 వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులుకు సేవలందించామన్నారు. 68 వేల మంది భక్తులుకు వైద్య సేవలందించినట్లు పేర్కొన్నారు.

READ MORE:Haryana elections: ఓటమి తర్వాత బాలికలకు ఫ్రీ బస్ సర్వీస్‌ని నిలిపేసిన ఎక్స్-ఎమ్మెల్యే..