Golla Ramavva: స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన వీరగాథ “గొల్ల రామవ్వ”. ఈ చిత్రంలో తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించారు. ఈ సినిమాను సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ – వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై… రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పలువురు అతిథులు మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో ఈ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
READ ALSO: Pakistan: ఇంతకన్నా దరిద్రం ఉంటుందా.. ‘‘గాజా పీస్ బోర్డు’’లో పాక్ చేరికపై సెటైర్లు..
ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకలో పి.వి.నరసింహారావు కుమారుడు పి.వి.ప్రభాకరరావు, కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురభి వాణీదేవి మాట్లాడుతూ.. ‘మా నాన్నగారు రాసిన గొప్ప కథల్లో ఒకటైన “గొల్ల రామవ్వ”ను ఎంతో గొప్పగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఈనెల 25 నుంచి ఈటీవీ విన్ లో ప్రసారం కానున్న ఈ చిత్రం తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం దక్కించుకుంటుంది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయితలు కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, రాజీవ్ కనకాల, “రజాకార్” దర్శకుడు యాటా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
READ ALSO: Deepinder Goyal: వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసిన దీపిందర్ గోయల్! రాజీనామాకు రీజన్ ఇదేనా?
