Site icon NTV Telugu

Actor Nandu – singer Geetha: తన ప్రపోజల్ సీక్రెట్ బయటపెట్టిన స్టార్ సింగర్..

Actor Nandu Singer Geetha

Actor Nandu Singer Geetha

Actor Nandu – singer Geetha: తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు గీతా మాధురి. ఎన్నో సెన్సేషన్ సాంగ్స్ తన మధురమైన గొంతుతో పాడి ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ స్టార్ సింగర్. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ప్రపోజల్ సీక్రెట్‌ను రివీల్ చేసింది. నిజానికి ఈ స్టార్ సింగరే ముందు తను ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను వ్యక్తం చేసినట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ ఈ స్టార్ సింగర్ ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసా.. ఆయన కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే.

READ ALSO: Local Body Elections : మూడో విడతలో 394 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

టాలీవుడ్‌లో సింగర్ గీతామాధురి-హీరో నందు అంటే తెలియని వారు ఉండరు. ఒక ఇంటర్వ్యూలో గీతామాధురి మాట్లాడుతూ.. నందుకు తను ఎలా లవ్ ప్రపోజ్ చేసిందో రివీల్ చేసింది. తమ పరిచయం ముందు ఫ్రెండ్స్‌గా స్టార్ట్ అయినట్లు పేర్కొన్నారు. ముందుగా తనే నందుకు ప్రపోజ్ చేసినట్లు తెలిపింది. ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అని కాదని అన్నారు. మన ఇద్దరి మైండ్ సెట్ మ్యాచ్ అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మెల్లిగా మీరు నుంచి నువ్వు అనే వరకు తమ సాన్నిహిత్యం పెరిగిందని చెప్పారు. నువ్వు కాస్తా, ఒసేయ్, ఒరెయ్ వరకు వెళ్లిందని, ఆ తర్వాత ఏంటి బుజ్జికి వచ్చిందన్నారు. ఈ జంట 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్టార్ కపుల్‌కు ఒక పాప, బాబు ఉన్నారు. ఇక హీరో నందు విషయానికి వస్తే ఆయన హీరో తెరకెక్కిన కొత్త సినిమా ‘సైక్ సిద్ధార్థ్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక గీతామాధురి విషయానికి వస్తే ఆమె టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరిగా, పలు సింగింగ్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

READ ALSO: Curry Leaves Benefits: ఆకు కాదండోయ్ అమృతం.. దీన్ని తింటే బెనిఫిట్స్‌ మామూలుగా లేవు

Exit mobile version