NTV Telugu Site icon

Teacher MLC Voter List : టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

Mlc

Mlc

Teacher MLC Voter List : టీచర్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకునేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 23న విడుదల చేయనున్న నేపథ్యంలో అధికారులు ఈ అవకాశాన్ని కల్పించారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారు, ఓటరుగా అర్హులైన వారు ఓటు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ శాసన మండలి నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని కల్పించారు. నవంబర్‌ 23నుంచి డిసెంబర్‌ 9వ తేదీ వరకు మరోసారి ఓటరు నమోదుకు భారత ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది.

Read Also: Sangareddy : టీఆర్ఎస్ బైక్‌ ర్యాలీ ఘటనలో మృతి చెందిన యువకుడు

ఇక ఈ ఓటు హక్కు పొందడానికి కావాల్సిన అర్హతల వివరాలను అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు నవంబర్ 1, 2022 నాటికి కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ఓటరు నమోదులో ఏమైనా సందేహాలు ఉంటే జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111ను సంప్రదించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే www.nvsp.in, voter helpline app, ceo.telangana.gov.in వెబ్ సైట్లో చూసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.

Show comments