Site icon NTV Telugu

Ind W vs Eng W 2nd ODI: భారత్ 143 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 116 రన్స్ చేసింది.. అయినా గెలిచింది!

Ind W Vs Eng W 2nd Odi

Ind W Vs Eng W 2nd Odi

ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు భారత మహిళల జట్ల మధ్య మూడు వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే మ్యాచ్ శనివారం లార్డ్స్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 143 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 116 రన్స్ చేసింది.. అయినా గెలిచింది. అమీ జోన్స్ 46, టామీ బ్యూమాంట్ 34 పరుగులతో రాణించడంతో, ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు భారత మహిళల జట్టును DLS పద్ధతిలో 8 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. లార్డ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.

Also Read:MLC Vijayashanti: గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ కాదు.. గుండెపై చేయి వేసి ‘జై తెలంగాణ’ అనండి!

దీంతో ఓవర్లను రెండుసార్లు తగ్గించాల్సి వచ్చింది. భారత మహిళలు మొదట బ్యాటింగ్ చేసి 144 పరుగులు చేశారు. తరువాత, ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. లండన్‌లో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓవర్లను తగ్గించి 29-29 ఓవర్లకు మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 29 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ గెలవడానికి 144 పరుగులు అవసరం. ఇంగ్లీష్ జట్టు 18.4 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 102 పరుగులు చేసినప్పటికీ వర్షం మళ్లీ ప్రారంభమైనందున మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది.

Also Read:Teachers: భర్త పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని టీచర్ ఆత్మహత్య!.. భర్త తట్టుకోలేక బ్లేడుతో..

వర్షం ఆగిన తర్వాత, ఇంగ్లాండ్‌కు 24 ఓవర్లలో 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇంగ్లాండ్ 21 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను గెలుచుకుంది. అమీ జోన్స్ 57 బంతుల్లో 5 ఫోర్లతో అజేయంగా 46 పరుగులు చేసింది. టామీ బ్యూమాంట్ 35 బంతుల్లో 34 పరుగులు, కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్ 25 బంతుల్లో 21 పరుగులు చేసింది. సోఫియా డంక్లీ 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

Also Read:Madhavaram Krishna Rao: జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధం.. ఎమ్మెల్యే మాధవరం ఆసక్తికర వ్యాఖ్యలు!

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే ఎం. అర్లాట్ ప్రతీకా రావల్ వికెట్ తీసుకుంది. స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇద్దరూ కూడా 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్లీన్ ను అవుట్ చేసిన సోఫీ ఎక్లెస్టోన్ ఈ భాగస్వామ్యానికి బ్రేక్ వేసింది. హర్లీన్ 24 బంతుల్లో 16 పరుగులు చేసింది. దీని తర్వాత, ఒక్కోక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 7, జెమిమా రోడ్రిగ్స్ 3, రిచా ఘోష్ 2, స్మృతి మంధాన 42, అరుంధతి రెడ్డి 14, స్నేహ రాణా 6 పరుగులు చేశారు. సోఫీ ఎక్లెస్టోన్ 3 వికెట్లు పడగొట్టింది. ఆమెను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు. ఎం. ఆర్లాట్, లిన్సే స్మిత్ తలా 2-2 వికెట్లు పడగొట్టారు.

Exit mobile version