Danni Wyatt and Georgie Hodge Married: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డాని వ్యాట్ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు జార్జి హాడ్జ్‌ను సోమవారం (జూన్ 10) లండన్‌లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన పోటోలను డాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో డాని, జార్జిలు మెరిసిపోతున్నారు. నూతన జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: RT75 Launched: ధమాకా జోడి రిపీట్.. రవితేజ, శ్రీలీల కొత్త సినిమా ఆరంభం!
డాని వ్యాట్, జార్జి హాడ్జ్‌లు 2019 నుండి డేటింగ్ చేస్తున్నారు. 2023 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇద్దరూ ప్రస్తుతం లండన్‌లో కలిసి ఉంటున్నారు. సీఏఏ బేస్‌కు చెందిన ఓ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు జార్జి హెడ్‌గా ఉన్నారు. లండన్‌లో ఎఫ్‌ఏ లైసెన్స్‌డ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక 33 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 2 టెస్టులు, 110 వన్డేలు, 156 టీ20లు ఆడారు. వన్డే, టీ20ల్లో రెండేసి సెంచరీలు చేశారు.