Site icon NTV Telugu

ENG vs SA: టీ20లో 300+ స్కోర్.. ఏంటి భయ్యా ఆ కొట్టుడు.. ఫిల్ సాల్ట్ దెబ్బకు దక్షిణాఫ్రికా ఫ్యూజులు అవుట్!

Sa Vs Eng

Sa Vs Eng

ENG vs SA: ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుకు మ్యాచులను పీడకలగా మారుస్తుంది. నిజానికి వన్డేల్లో 300 స్కోర్ అంటే మోస్తారు మంచి స్కోర్. అదే స్కోరు టి20లో చేస్తే.. అది కూడా దక్షిణాఫ్రికా లాంటి టాప్ క్లాస్ టీం పై. అవునండి బాబు.. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుపై 304 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మాంచెస్టర్‌ ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు సిక్సర్లతో చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా కేవలం 60 బంతులలో 141 పరుగులతో అజయంగా నిలిచాడు. మరోవైపు అతనికి తోడుగా జోష్ బట్లర్ 30 బంతుల్లో 83 పరుగులు సాధించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 126 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బెతెల్‌ (26), బ్రూక్‌ (41) పరుగులకు నిర్ణిత 20 ఓవర్లలో 304 పరుగుల భారీ స్కోర్ ను చేసింది.

5జీ కనెక్టివిటీ, స్లిమ్ డిజైన్ తో సరికొత్త బడ్జెట్ రేంజ్ Moto Pad 60 NEO వచ్చేసిందోచ్!

ఈ దెబ్బతో ఇంగ్లాండ్ టీ20ల్లో మూడో అత్యధిక స్కోర్ ను సాధించిన జట్టుగా రికార్డుకు ఎక్కింది. 2024లో జింబాబ్వే జట్టు గాంబియాపై 344 పరుగులతో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత 2023లో నేపాల్‌ 314 పరుగులతో రెండో స్థానంలో ఉంది. కాకపోతే, టెస్టు దేశాలు అర్హత ఉన్న అత్యధిక టీ20 స్కోరు మాత్రం ఇదే. ఇక భారీ అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాను కేవలం 158 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 146 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ విజయం అందుకుంది. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులతో విజయం సాధించిన జట్టుగా ఇంగ్లాండ్‌ రికార్డు సృష్టించింది.

4GB లిమిటెడ్ ఎడిషన్‌గా POCO M7 Plus 5G.. పూర్తి వివరాలు ఇలా!

Exit mobile version