Site icon NTV Telugu

IND vs ENG: ఇంగ్లాండ్ వెన్నువిరిచిన వాషింగ్టన్ సుందర్.. భారత్ టార్గెట్ 193

Ind Vs Eng

Ind Vs Eng

భారత్, ఇంగ్లాండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా మూడవ మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ 193 పరుగులు చేయాలి. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 192 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్స్ ఖాతాలో వేసుకున్నారు. నితీశ్‌ రెడ్డి, ఆకాశ్‌ దీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Also Read:Jharkhand: రోజూ రైలులో ప్రయాణిస్తున్న కోతి.. కిటికీ పక్కన సీటులో కూర్చొని ఎక్కడికి వెళ్తుందో తెలుసా?

ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. బరిలోకి దిగిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ కూడా 387 పరుగుల వద్ద ముగిసింది. అంటే మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్ల స్కోరు సమానంగా ఉంది. ఇప్పుడు లార్డ్స్ టెస్ట్ గెలవాలంటే భారత్ 193 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా గెలిస్తే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో ఆధిక్యం సాధిస్తుంది.

Also Read:Execution: నిమిషాప్రియా మాత్రమే కాదు, మరో దేశంలో ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష..

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (40; 96 బంతుల్లో) టాప్ స్కోరర్. బెన్ స్టో్క్స్ (33; 96 బంతుల్లో 3 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (23; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), జాక్ క్రాలీ (22), బెన్ డకెట్ (12) పరుగులు చేశారు. ఓలీ పోప్ (4), జేమీ స్మిత్ (8), బ్రైడన్ కార్స్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

Exit mobile version