England Cricket Contracts 2025: క్రికెట్‌లో సెంట్రల్ కాంట్రాక్టుల గురించి తెలుసు కదా.. ఈ కాంట్రాక్టులు క్రీడాకారులకు చెల్లించే డబ్బులకు సంబంధించినవి. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 2025-26 సీజన్ కోసం కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది. ఈసారి ఈ జాబితాలో మొత్తం 30 మంది పురుషుల అంతర్జాతీయ ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. వీరిలో 14 మంది ఆటగాళ్లు రెండేళ్ల ఒప్పందాలపై సంతకం చేయగా, 12 మంది ఆటగాళ్లకు ఒక ఏడాది కాంట్రాక్టులు లభించాయి. ఇంతకీ వాళ్లు ఎవరు, గతంలో ఒప్పందం పొంది కొత్త జాబితాలో చోటు దక్కించుకోని వారు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Smartphones: రూ.10,000 లోపు టాప్ స్మార్ట్‌ఫోన్‌లు.. సామ్ సంగ్ నుంచి మోటరోలా వరకు ఇవే
ఆరుగురు ఆటగాళ్లకు కాంట్రాక్టులు రద్దు..
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మునుపటి సెంట్రల్ కాంట్రాక్టులో భాగమైన ఆరుగురు ఆటగాళ్లకు తాజా జాబితాలో చోటు ఇవ్వలేదు. కాంట్రాక్టు రద్దు చేసిన ఆ ఆరుగురు ఆటగాళ్లు ఎవరంటే.. జానీ బెయిర్‌స్టో, జాక్ లీచ్, లియామ్ లివింగ్‌స్టోన్, ఓలీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన క్రిస్ వోక్స్‌కు కూడా జాబితాలో ప్లేస్ లేదు. ఈ సారి కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన వాళ్లు ఎవరంటే.. సోనీ బేకర్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, జామీ ఓవర్టన్, ల్యూక్ వుడ్.
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కొత్త ఒప్పందంలో భాగంగా రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేశాడు. ఇది 2027 యాషెస్ సిరీస్‌లో స్వదేశంలో ఆడాలనే తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా సూచిస్తుందని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం సెప్టెంబర్ 30, 2027 వరకు అమలులో ఉంటుంది. గాయాల కారణంగా గత 12 నెలలుగా టెస్ట్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారించిన 34 ఏళ్ల స్టోక్స్, ఈ నిర్ణయంతో తన భవిష్యత్ ప్రణాళికలను స్పష్టం చేశాడు. అలాగే ఇంగ్లాండ్ టీం హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఒప్పందం కూడా 2027 చివరి వరకు కొనసాగుతుంది.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ లీస్ట్..
2 సంవత్సరాల సెంట్రల్ కాంట్రాక్ట్: జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కుర్రాన్, బెన్ డకెట్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్, బెన్ స్టోక్స్, జోష్ టంగ్.
1-సంవత్సరం సెంట్రల్ కాంట్రాక్ట్: రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్, మార్క్ వుడ్.
READ ALSO: UPI Malaysia Launch: సాహో భారత్.. మలేషియాలో యూపీఐ అధికారిక సేవలు ప్రారంభం
