NTV Telugu Site icon

IND vs ENG: టాస్ ఓడిన భారత్.. ముందుగా బ్యాటింగ్

Ind Vs Eng

Ind Vs Eng

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. కాసేపట్లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరుగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్.. గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. రాత్రి 7.30 గంటలకు టాస్ జరిగి.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం పడటంతో ఆలస్యమైంది.

ఇదిలా ఉంటే.. ఇరు జట్లు ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పు చేయలేదు. మరోవైపు.. ఇంగ్లండ్ జట్టుపై రెండేళ్ల క్రితం ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు రంగంలోకి దిగుతుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టు 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో పాత స్కోర్‌లను పరిష్కరించుకోవడంతోపాటు ఫైనల్స్‌లోకి ప్రవేశించడంపైనే భారత్ దృష్టి ఉంది. భారత్, ఇంగ్లండ్ రెండు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్, ఇంగ్లండ్ రెండూ 2-2 మ్యాచ్‌లు గెలిచాయి.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్:
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ.