NTV Telugu Site icon

IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్

Ind Vs Eng 4th T20

Ind Vs Eng 4th T20

ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా కాసేపట్లో చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో.. ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. మరోవైపు భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ ఒక మార్పు చేసింది. అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినిచ్చి మహ్మద్ షమీకి అవకాశం కల్పించారు. కాగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. సూర్య బ్రిగేడ్ ఈ సిరీస్‌ను విజయవంతంగా ముగించాలని చూస్తోంది. మరోవైపు టీమిండియా ఓపెనర్లు సంజూ శాంసన్, సూర్యకుమార్ ఇప్పటి వరకు బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు తిరిగి విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు ఏ విభాగంలోనూ ఇంగ్లండ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.

Read Also: Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం.. గూండాయిజం చేస్తోందని ఆరోపణలు!

భారత్ ప్లేయింగ్ ఎలెవన్:
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.