ENG W vs IND W: ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 2012 నుంచి ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌లు ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరీస్‌ను గెలవలేకపోయిన భారత్ ఈసారి విజయం సాధించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాల్గో టీ20లో టీమిండియా ఘన విజయం నమోదు చేయడంతో.. మరో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
Read Also:Phone tapping case: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు..!
జులై 9 (బుధవారం)న మాంచెస్టర్‌లో జరిగిన నాల్గో టీ20లో భారత్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళల జట్టు 20 ఓవర్లలో 7 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో సాఫియా డంక్లే (22), టామీ బోమాంట్ (20), అమీ జోన్స్ (9) సహా మిగతా బ్యాటర్లు భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కించుకుంది. శ్రీఛరణి కూడా 2 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేసింది.
ఇక 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు సమిష్టిగా ఆడి 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇక భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధాన (32), షఫాలీ వర్మ (31) మంచి ఇన్నింగ్స్ ఆరంభం ఇచ్చారు. మధ్యలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (26), జెమీమా రోడ్రిగ్స్ (24 నాటౌట్) అద్భుతంగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించారు. రాధ యాదవ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ లభించగా, షఫాలీ వర్మకు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు దక్కింది.
Read Also:AP Liquor Case: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. రిటైర్డ్ ఐఏఎస్‌కు సిట్ నోటీసులు
ఈ విజయంతో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ను గెలిచిన ఘనతను సాధించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన నాలుగు సిరీస్‌లలో మూడు సార్లు ఇంగ్లాండ్ గెలవగా, ఈసారి భారత్ జెండా ఎగరేసింది. ఇక నామమాత్రపు చివరి టీ20 మ్యాచ్ జులై 12న జరగనుంది.
Win the match ✅
Win the series ✅Jemimah Rodrigues and Richa Ghosh take #TeamIndia over the line 💪
Scoreboard ▶️ https://t.co/QF3qAMduOx#ENGvIND | @JemiRodrigues | @13richaghosh pic.twitter.com/f2KHmllSdj
— BCCI Women (@BCCIWomen) July 9, 2025
