Site icon NTV Telugu

ENG vs SA: వరల్డ్ నెం.1 బౌలర్ దెబ్బకి కుప్పకూలిన ఇంగ్లాండ్.. 49 పరుగులకే 8 వికెట్స్!

Eng Vs Sa

Eng Vs Sa

ENG vs SA: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. కేవలం 131 పరుగులకే ఆల్ అవుట్ అయిన ఆతిథ్య జట్టును, దక్షిణాఫ్రికా 7 వికెట్లు, 175 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (54) తప్ప మిగతావారంతా తేలిపోయారు. ప్రస్తుత వన్డే వరల్డ్ నెం.1 బౌలర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్ తన స్పిన్ మ్యాజిక్‌తో కేవలం 5.3 ఓవర్లలో 22 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను తెలుకోలేకుండా చేశాడు. అతనికి తోడుగా వుయాన్ ముల్డర్ కూడా 3 తీసి టీంకు మద్దతు ఇచ్చాడు.

Govt Land Auction: మరోసారి భూముల వేలానికి సిద్ధమైన రేవంత్ సర్కార్.. ఎకరా రూ.101 కోట్లు!

ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తరఫున ఐడెన్ మార్క్‌రమ్ తనదయిన దూకుడు ఆటతో కేవలం 55 బంతుల్లోనే 86 పరుగులు హేరోదు. ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ అక్కడికక్కడే సౌతాఫ్రికా వైపు మళ్లింది. అతనితోపాటు రికెల్టన్ (31*) కీలక ఇన్నింగ్స్ ఆడగా చివర్లో బ్రెవిస్ సిక్సర్‌తో విజయం అందించాడు. దీనితో దక్షిణాఫ్రికా కేవలం 20.5 ఓవర్లు లో విజయాన్ని అందుకుంది. ఇక అద్భుత బౌయింగ్ ప్రదర్శనకు గాను కేశ‌వ్ మ‌హ‌రాజ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ సొంతం చేసుకున్నాడు. దీనితో దక్షిణాఫ్రికా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో మ్యాచ్ 4న లార్డ్స్ వేదికగా జరగనుంది.

Krish Jagarlamudi: హరిహర వీరమల్లు సెకండ్ పార్ట్ కోసం 40 నిమిషాల ఫుటేజ్ రెడీ.. క్రిష్ రివీల్ చేసేశాడుగా!

Exit mobile version