Harry Brook Sledge Shubman Gill: ఐదు టెస్ట్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్షాన్ని ఉంచిన గిల్ సేన.. ఇప్పటికే మూడు వికెట్లు తీసి విజయం దిశగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 72/3 స్కోరుతో ఉండగా.. చివరి రోజైన ఆదివారం భారత్ 7 వికెట్స్ తీస్తే మ్యాచ్ సొంతమవుతుంది. ప్రస్తుతం మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు సాగాయి.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ కలిసి నాలుగో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ సమయంలో బాగా ఆడుతున్న శుభ్‌మన్ గిల్‌ను హ్యారీ బ్రూక్ కవ్వించాడు. గిల్ క్రీజ్‌లో ఉండగా.. బ్రూక్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ‘450 రన్స్ సరిపోతాయి. ఐదో రోజు వర్షం పడే అవకాశాలు చాలా ఉన్నాయి. హాఫ్ డే వెస్ట్ అవుతుంది’ అని బ్రూక్ అన్నాడు. ‘సరేలే మాకు కలిసి రాలేదని అనుకుంటాం’ అని గిల్ బదులిచ్చాడు. డ్రా తీసుకోండి అని బ్రూక్ అనగా.. గిల్ నవ్వుతూ తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్స్‌లో రికార్డయ్యాయి.
Also Read: Team India: టీమిండియా అరుదైన రికార్డు.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి!
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. మొదటి టెస్ట్‌లో 147, 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 269 రన్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 161 బాదాడు. సారథి గిల్ మరింత భాద్యతగా ఆడుతున్నాడు. ఇంకా మూడు టెస్టులు ఉన్న నేపథ్యంలో గిల్ ఖాతాలో మరిన్ని శతకాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీంఇండియా చూస్తోంది.
