Site icon NTV Telugu

Vijayawada: టేబుల్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్

Vijayawada

Vijayawada

Vijayawada: విజయవాడలోని గొల్లపూడిలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విభాగాల యూనిట్ టేబుల్ క్యాలెండర్‌ను దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ సుసర్ల శ్రీనివాసరావు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాడర్ సర్వీస్ విషయంలో చేస్తున్న కృషి చాలా అభినందనీయం అంటూ అసోసియేషన్ సభ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రెటరీ సోమయాజులు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ యూనిట్‌ ప్రెసిడెంట్ భవిరి, ఫైనాన్స్ సెక్రెటరీ టి. హేమసుందర్ పాల్గొన్నారు, అనంతరం భవిరి మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విభాగాల యూనిట్ తరపున టేబుల్‌ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు.

Exit mobile version