NTV Telugu Site icon

Bhatti Vikramarka: ముగిసిన భట్టి పీపుల్స్‌ మార్చ్‌.. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర.

Bahtti

Bahtti

Bhatti Vikramarka: ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మంలో ముగిసింది. 13 కి.మీ దూరంలో నిన్న బస చేసిన బట్టి.. ఇవాళ జనగర్జన సభకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ముగించారు. 109 రోజులు.. 1360 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేపట్టారు. మరోవైపు జనగర్జన సభ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. సుదీర్ఘ యాత్ర చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సభలో సన్మానించారు. ఈ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

Ponguleti Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి.. కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ

అటు భట్టి విక్రమార్క పాదయాత్ర తెలంగాణలోని 17 జిల్లాల్లోని బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధ‌ర్మపురి, పెద్దప‌ల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వ‌ర్ధన్నపేట‌, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్ పూర్, జ‌న‌గామ‌, అలేరు, భువ‌న‌గిరి, ఇబ్రహీం ప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ న‌గ‌ర్, ప‌రిగి, జ‌డ్చెర్ల, నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ, నాగార్జున సాగర్, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, పాలేరు, ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గాల్లో పీపుల్స్ మార్చ్ నిర్వహించారు.

Payal Rajput: వాళ్లు తప్పుదోవ పట్టించి, వాడుకున్నారు.. పాయల్ సంచలన వ్యాఖ్యలు

17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల్లో కొనసాగిన భట్టి విక్రమార్క పాదయాత్రతో తెలంగాణ కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరిగింది. భట్టి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్న తీరు దివంగత వైఎస్సాఆర్ ను తలపిస్తుండటంతో క్షేత్రస్థాయి నుండి ప్రజలు మళ్లీ కాంగ్రెస్ కి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత సుదూర ప్రయాణంలో ఎక్కడ తన స్వోత్కర్ష లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తుందో చెప్పుకుంటూ వెళ్ళడం ఆయన రాజకీయ నిబద్ధతకు నిదర్శనం. ఇందిరమ్మ రాజ్యం రావాలి.. ఇంటింటా సౌభాగ్యం నెలకొనాలని.. నాటి వైఎస్సార్ బాట లోనే భట్టి విక్రమార్క ప్రజల కష్టాలను వింటూ వారికి కాంగ్రెస్ పార్టీ ఉందనే భరోసాను కల్పిస్తూ పాదయాత్ర చేయడం విశేషం.

 

Show comments