Site icon NTV Telugu

Shopian gunfight: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Encounter

Encounter

ఆపరేషన్ సిందూర్ కింద సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై చర్య తీసుకున్న తర్వాత, భద్రతా దళాలు ఇప్పుడు సరిహద్దు లోపల అంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైనిక చర్యను ముమ్మరం చేశాయి. షోపియన్‌తో సహా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు అడవిలో లష్కరే తోయిబా ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు.

Also Read:Supreme Court: నేటితో పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా

దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని షుక్రు కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు అక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని ఆయన అన్నారు. ప్రతీకారంగా, భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Exit mobile version