Site icon NTV Telugu

Chhattisgarh: బీజాపూర్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

15maoistskilled

15maoistskilled

మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. భద్రతా బలగాలు మావోలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా బీజాపూర్ జిల్లా బేధారే పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్పె-తొడ్సంపార అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో గుండిపురి RPC మిలిషియా ప్లాటూన్ కమాండర్ వెల్లా వాచమ్ అనే మావోయిస్టు మృతి చెందాడు ఇతనిపై మూడు లక్షల రివార్డు ఉన్నది.

Also Read:YS Jagan: యుద్ధ వాతావరణంలోనే వైసీపీ పుట్టింది.. ఆ తర్వాత కూడా యుద్ధమే..!

ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాల 7వ బెటాలియన్, E కంపెనీ క్యాంప్ నూగూర్ తోడ్సంపార అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం మేరకు భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు అనంతరం ఆ ప్రాంతంలో గాలిస్తుండగా మావోయిస్టు మృతదేహం లభించింది. సంఘటన స్థలంలో 303 రైఫిల్ తో పాటు భారీ ఎత్తున మందు గుండు సామాగ్రినీ స్వాధీన పరుచుకున్నారు.

Exit mobile version