బాలీవుడ్ తెరపై ముద్దు సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ ఇమ్రాన్ హష్మీ. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన లిప్ లాక్ సీన్స్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన, గత ఆరేళ్లుగా ఆ ఇమేజ్‌కు దూరంగా ఉంటున్నారు. ‘టైగర్ 3’ వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించి, తాను ఇప్పుడు ‘రిటైర్డ్ కిస్సర్’ అని ప్రకటించుకున్న ఇమ్రాన్, తాజాగా తన పాత రూటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ‘ఆవారపన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఆవారపన్ 2’ లో ఇమ్రాన్ హష్మీ సరసన దిశా పటానీ నటిస్తోంది. అయితే..
Also Read : Ram Gopal Varma: జీసస్, అల్లా మధ్య ఫైట్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా..
ఈ సినిమాలో హీరో-హీరోయిన్ల మధ్య అత్యంత సన్నిహిత సన్నివేశాలు (Intimate Scenes) ఉన్నాయని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గ్లామర్ షోకు ఏమాత్రం వెనుకాడని దిశా పటానీ, ‘సీరియల్ కిస్సర్’గా పేరొందిన ఇమ్రాన్ హష్మీ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. అయితే, 2019 నుంచి ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటున్న ఇమ్రాన్, ఈ సినిమా కోసం తన ‘నో కిస్’ పాలసీని పక్కన పెట్టారా? లేక ఇంటిమేట్ సీన్స్‌తోనే సరిపెట్టారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో వీరిద్దరి రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతంలో తన ముద్దు సీన్ల వల్ల భార్య అలిగితే ఖరీదైన హ్యాండ్ బ్యాగులు కొనిచ్చి ఒప్పించేవాడినని ఇమ్రాన్ సరదాగా చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు దిశాతో సీన్ల కోసం ఆయన ఎలాంటి ప్లాన్ చేశారో చూడాలి!
