Site icon NTV Telugu

అసెంబ్లీ ఆవరణలో మద్యం బాటిళ్ల కలకలం..

బీహార్‌ అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రమాణం చేసిన మరుసటి రోజే, ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయని మండిపడిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఇక ఈ సంఘటనపై సీఎం నితీశ్ కుమార్ కూడా స్పందించారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధకరమని… దీనిపై స్పీకర్ ఆదేశిస్తే.. విచారణ చేయిస్తామన్నారు సీఎం నితీశ్ కుమార్.

Exit mobile version