NTV Telugu Site icon

Job Fraud Case: జూబ్లీహిల్స్ జాబ్ ఫ్రాడ్ కేసులో ట్విస్ట్..

Fraud

Fraud

గిగ్లైజ్‌ కంపెనీ సీఈవోను కిడ్నాప్ చేయలేదని బాధిత నిరుద్యోగులు, జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులు ఎన్టీవీతో చెప్పారు. నిరుద్యోగులు అందరం జాగృతి కన్సల్టెన్సీ, SLC కన్సల్టెన్సీ వెంకట్కి ఐటీ ఉద్యోగం కోసం డబ్బులు కట్టామని తెలిపారు. చాలా మంది వద్ద రూ. 2 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారని.. కన్సల్టెన్సీల నుండి కోట్ల రూపాయలు దండుకుని ఉద్యోగం కల్పిస్తామని చెప్పి గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డి బోర్డు తిప్పేసారని వారు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు వసూలు చేసిన గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డి పరారయ్యాడని బాధితులు చెబుతున్నారు. అసలు.. తాము రవిచంద్ర రెడ్డిని కిడ్నాప్ చేయలేదని అంటున్నారు.

ఫేక్ ఉద్యోగాలు ఇచ్చి, జీతాలు ఇవ్వకుండా వేధింపులు గురి చేసింది గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డినే అని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగుల నుండి తమకు ప్రెషర్ అవడంతో రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లినట్లు జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులు తెలిపారు. దీంతో.. అతనితో మాట్లాడేందుకు బయటకు తీసుకెళ్లారు.. ఫామ్ హౌస్ లో సెటిల్ చేసుకుందామని రవిచంద్ర రెడ్డి జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులతో వెళ్ళాడని బాధితులు తెలిపారు. అంతలోనే రవిచంద్ర రెడ్డి తన తల్లికి ఫోన్ చేసి జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులపై కిడ్నాప్ కేసు పెట్టించాలని కోరాడన్నారు. ఫిర్యాదు అందిన 5 గంటల్లోనే జూబ్లీహిల్స్‌ పోలీసులు జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. దీంతో.. జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులపై రవిచంద్ర రెడ్డి తల్లి కావాలనే కిడ్నాప్ కేసు పెట్టారని బాధితులు చెబుతున్నారు.

Israel: హమాస్ మిలిటరీ చీఫ్ లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడి.. 71 మంది మృతి..

కాగా.. అంతకుముందు ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. కోట్ల రూపాయలు దండుకుని బోర్డు తిప్పేసిన ‘గిగ్లైజ్’ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డిని కిడ్నాప్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రెండు లక్షలు వసూలు చేసి.. మోసం చేసిన గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డిని కన్సల్టెన్సీ ఉద్యోగులు కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫేక్ ఉద్యోగాలు ఇచ్చి.. జీతాలు ఇవ్వకుండా వేధింపులు గురి చేశాడు రవిచంద్ర రెడ్డి. కాగా.. రవిచంద్ర రెడ్డి కిడ్నాప్ ఫిర్యాదు అందిన 5 గంటల్లోనే జూబ్లీహిల్స్‌ పోలీసులు బాధితుడిని గుర్తించడంతో పాటు 8మందిని అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లోని హుడా ఎన్‌క్లేవ్‌ నందగిరిహిల్స్‌లో నివసిస్తున్నాడు వాకటి రవిచంద్రారెడ్డి. రాయదుర్గం టీ-హబ్‌ సమీపంలోని ఆర్బిట్‌మాల్‌లో ‘గిగ్లైజ్‌’ పేరుతో గత నవంబరులో సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రారంభించాడు. జనవరి నుంచి జీతాలు చెల్లించలేదని కంపెనీ బాధితులు చెబుతున్నారు. ఈ నెల 9న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రవిచంద్రారెడ్డి ఇంటికి ఎనిమిది మంది కన్సల్టింగ్‌ సిబ్బంది వచ్చి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.