ప్రభుత్వ ఉద్యోగులంటే హుందాతనంగా, జవాబుదారీగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వెర్రి వేశాలు వేస్తే విలువ పోతుంది. ఇదే రీతిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రామ్ లో బ్రేక్ డ్యాన్సులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read:Nizamabad : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘర్షనకు దిగిన సీనియర్,జూనియర్ మెడికోలు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులు డాన్స్ వేయడం వైరల్ గా మారింది. మండల పరిషత్ అధికారులు డాన్స్ వేయడమే కాకుండా. మహిళా పంచాయతీ అధికారినిలను పట్టుకొని బలవంతంగా స్టేజ్ పైకి లాగి డాన్స్ చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మండల అధికారులు మహిళలు పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. రంపచోడవరంలో వైటిసి ప్రాంగణం లో ఆది కర్మయోగి అభియాన్ ప్రోగ్రాం నిర్వహించారు.
ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రాంలో పంచాయతీ అధికారులు బ్రేక్ డాన్సులతో ఊగిపోయారు. వాళ్లతోపాటు మహిళా ఉద్యోగులని కూడా చేతులు పట్టుకుని లాగి వాళ్లతో కూడా డాన్సులు వేశారు. అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు చప్పట్లు కొడుతూ వీళ్ళని ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో బయటికి రావడంతో ఉద్యోగుల తీరు విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులు డ్యాన్సులు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ దృశ్యాలను చూసి ప్రజలు చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు.
