Site icon NTV Telugu

Emotional Video: తొక్కిసలాటలో కుమారుడు మృతి.. కొడుకు సమాధిపై పడి బోరున విలపించిన తండ్రి(వీడియో)

Emotional Video

Emotional Video

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల భూమిక్ లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడి తండ్రి బిటి లక్ష్మణ్ భావోద్వేగ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో బిటి లక్ష్మణ్ తన కొడుకు సమాధిపై పడి బోరున విలపిస్తున్నాడు.

READ MORE: Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ మరణం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. సీఎం రేవంత్ సంతాపం

వైరల్ వీడియోలో… “నా కొడుకుకు జరిగినది మరెవరికీ జరగకూడదు, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ వెళ్లాలనుకోవడం లేదు.” అని చెబుతూ బిటి లక్ష్మణ్ ఏడుస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు అతన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తారు. నా లాంటి గతి ఏ తండ్రికీ రావొద్దని అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాస్తవానికి.. భూమిక్ లక్ష్మణ్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థి. వేడుకల్లో పాల్గొనడానికి తన స్నేహితులతో వచ్చాడు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు భావోద్వేగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

READ MORE: Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ రాజకీయ నేపథ్యం.. పూర్తి వివరాలు ఇవే

Exit mobile version