సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కారణంగా చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఇండిగో ప్లైట్ కు వడగండ్ల వాన ముప్పు తప్పిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలో ఓ విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో లేజర్ లైట్ ను విమానంపై వేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
Also Read:Himanta Biswa Sarma: ‘చికెన్ నెక్’ వివాదంపై బంగ్లాదేశ్‌కు హెచ్చరిక చేసిన అస్సాం సీఎం..!
ఈ సమయంలో విమానంలో 326 మంది ప్రయాణికులు ఉన్నారు. దుబాయ్ నుంచి చెన్నైలో 326 మంది ప్రయాణికులతో దిగుతున్న విమానంపై లేజర్ లైట్ ప్రయోగించారు. రేజర్ లైట్ తో అలెర్ట్ అయిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పైలట్. పరంగిమలై కొండ నుంచి విమానంపై లేజర్ కాంతులు ప్రయోగించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
