Site icon NTV Telugu

Elon Musk: భారత ప్రధాని మోడీతో ఎలాన్ మస్క్ సమావేశం

Elon Musk Modi

Elon Musk Modi

అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్రమోడీ భాగంగా బుధవారం న్యూయార్క్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్‌ కలిశారు. మస్క్ తనను తాను మోడీ అభిమాని అని కూడా చెప్పుకున్నారు. భారత ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఎలాన్ మస్క్ ప్రశంసించారు. భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.. ప్రపంచంలోని అన్ని పెద్ద దేశాల కంటే భారత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

Read Also: Diabetes: షుగర్ ఉన్నవాళ్లు అరటిపండ్లను ఇలా తీసుకోవడం మంచిదట..

ప్రధానమంత్రి మోడీ భారతదేశం గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారు, ఎందుకంటే మోడీ పెట్టుబడులు పెట్టడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తారు అని అన్నాడు. నేను మోడీ అభిమానిని.. ఇది అద్భుతమైన సమావేశం.. నాకు మోడీ అంటే చాలా ఇష్టం అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ భారత్‌లో పర్యటించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది తాను భారతదేశాన్ని సందర్శిస్తానని మాస్క్ చెప్పుకొచ్చాడు. భారత ప్రధాని మోడీతో సమావేశం అద్భుతమైనదని టెస్లా సీఈఓ అన్నారు.

Read Also: Oppo Reno 10 Pro Series : ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..

స్పేస్‌ఎక్స్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన స్టార్‌లింక్‌ను భారత్‌కు తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంటర్నెట్ యాక్సెస్ లేని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇది సహాయపడుతుందని ఎలాన్ మస్క్ చెప్పారు. మస్క్‌తో పాటు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత నీల్ డి గ్రాస్సే టైసన్, నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త పాల్ రోమర్, రచయిత నికోలస్ నాసిమ్ తలేబ్, పెట్టుబడిదారుడు రే డాలియోలు ప్రధాని మోడీని కలిసిన వారిలో ఉన్నారు.

Exit mobile version