Site icon NTV Telugu

Elon Musk : మరోసారి రచ్చలేపిన ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలు..

Elon Musk

Elon Musk

Elon Musk Made Comments On Money.

ఎలాన్‌ మస్క్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ కుబేరుడిగా మాత్రమే కాకుండా.. ప్రముఖ కార్ల సంస్థ టెస్లా అధినేతగా కూడా మస్క్‌గు గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఎప్పడూ సోషల్‌ మీడియాతో యాక్టివ్‌గా ఉండే ఎలాన్‌కు భారీగానే అభిమానులున్నారు. అయితే ట్విట్టర్‌లో పెట్టే ప్రతి ట్విట్‌కు చాలానే లైకులు, కామెంట్లు వస్తుంటాయి. అయితే గత కొంత కాలంగా ట్విట్టర్‌ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన డబ్బు గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే అనుకుంటే ప్రమాదమేనని.. డబ్బు సొంతంగా శక్తి, విలువ ఉండవంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘‘ప్రజలు ఆర్థిక వ్యవస్థనే డబ్బుగా భ్రమపడుతుంటారని, మనీ అన్నది వస్తువులు, సేవలను ఇచ్చి పుచ్చుకునే ఓ డేటాబేస్ మాత్రమేనన్నారు. దానంతట అదే డబ్బుకి శక్తి లేదని. నిజమైన ఆర్థికం అంటే వస్తు సేవలే అన్నారు మస్క్‌. అయితే.. ప్రస్తుతం ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలు చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే.. మస్క్‌కు డబ్బు ఎక్కువయ్యే ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండటం గమనార్హం.

 

 

Exit mobile version