NTV Telugu Site icon

Elon Mask Post On X: మస్క్ మావ భలే చిలిపి.. వైరల్ అవుతున్న మస్క్ ట్వీట్

Musk

Musk

ఎలాన్ మస్క్.. ప్రస్తుతం ఈ పేరు ఒక సంచలనం. ఆయన ఏం చేసినా అది వైరల్ న్యూసే. ఆయన కావాలనుకుంటే ఏ షేర్ నైనా పెంచగలడు, దేనినైనా దించేయగలడు. విభిన్నమైన ఆలోచనలు ఆయన సొంతం. అందరి కంటే ఎంతో ముందు చూపుతో ఆలోచించడం మస్క్ గొప్పతనం. దానితో ఆయన స్పేస్ ఎక్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ఈవీ కార్ల తయారీలో ముందంజలో ఉన్నారు. ఇక అన్నింటికీ సంచలనంగా మారిన మస్క్ చేయాల్సినవన్నీ చేసేసి కూల్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి అయితే మస్క్ మరింత సంచలనంగా మారారు. కొనుగోలు చేసిన మొదటి నుంచే అందులో ఉన్న ఉన్నతాధికారులను తొలగించడం, ఇక సీఈఓగా కుక్క ఫోటోను పెట్టడం, దాని గురించి నెటిజన్ల అభిప్రాయాన్ని కనుక్కోవడం, మొన్నటికి మొన్న ట్విటర్ పేరును ఎక్స్ గా మార్చడం అన్నీ సంచలనాలే.  అది మాత్రమే కాకుండా  మార్క్ జుకర్ బర్గ్ తో కేబ్ ఫైట్ పోటీ అన్న మస్క్ దాని కోసం ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేశారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అది చూసిన వారు మస్క్ మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే అనుకున్నాం ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఏ చిలిపి దొంగ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Zepto: అరరే ఎంత పనైపోయింది.. అప్లై చేసింది ఒక ఉద్యోగానికి వచ్చింది డెలివరీ బాయ్ జాబ్

మస్క్ తనలోని చిలిపి తనాన్ని తెలిపేలా తన ఎక్స్( ట్విటర్) ఖాతాలో ఒక ఫోటో పెట్టారు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఫోటోలో ఒక వ్యక్తి తన కంప్యూటర్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అతని భార్య ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అతడిని గట్టిగా పట్టుకొని ఫైనల్లీ నువ్వు పనిచేయడం అయిపోయింది, నేను ఇంకా నీతో ఆడుకుంటాను హనీ అంటుంది. దానికి ఆ భర్త ఆగు నేను ఈ మీమ్ ను ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేయాలి అని అంటాడు. అంటే పని చేసిన అంత శ్రద్దగా ఎక్స్(ట్విటర్)లో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారని, భార్య కంటే కూడా ఎక్స్ ( ట్విటర్) ముఖ్యమని అర్థం వచ్చేలా మస్క్ ఈ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన వారందరూ మస్క్ మాములోడు కాదుగా, ఆయన లో ఈ చిలిపి యాంగిల్ కూడా ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు. మస్క్ ఓ చిలిపి దొంగ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.