Site icon NTV Telugu

Ellyse Perry: సెంచరీతో అదరగొట్టిన ఎలీస్ పెర్రీ.. చరిత్రలో అరుదైన ఘనత..!

Ellyse Perry

Ellyse Perry

Ellyse Perry: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌ (WBBL) 2025 లో భాగంగా డిసెంబర్ 7న నార్త్ సిడ్నీ ఓవల్ వేదికగా జరిగిన 40వ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ అదరగొట్టింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌పై ఆడిన ఈ మ్యాచ్‌లో పెర్రీ 71 బంతుల్లో 111 పరుగుల సెంచరీని సాధించింది. ఈ నేపథ్యంలో WBBL చరిత్రలో 5000 పరుగుల మార్క్ అందుకున్న రెండో మహిళగా రికార్డ్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఘనతను అందుకున్న మొదటి మహిళా బ్యాటర్ బెత్ మూనీ. ఆమె ఇప్పటివరకు 5446 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా.. తాజా మ్యాచ్‌తో పెర్రీ తన పరుగుల సంఖ్యను 5072కు చేర్చుకుని ఈ జాబితాలో రెండో స్థానానికి చేరింది.

Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ‘కింగ్’ కోహ్లీ.. ఫొటోలు వైరల్!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన సిడ్నీ సిక్సర్స్ ఇన్నింగ్స్‌ను ఎలీస్ పెర్రీ శతకంతో శుభారంభం చేసింది. ఆమెతో పాటు సోఫియా డంక్లీ 54 పరుగులు చేయడంతో జట్టు 173 పరుగుల భారీ స్కోరు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఎలీనర్ లారోసా నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి సిక్సర్స్‌కు కాస్త ఇబ్బంది కలిగించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ మంచి ఆరంభం చేసినా ఒక్క పరుగుతో ఓడింది. ఓపెనర్లు టామీ బూమాంట్ (23), మాడెలిన్ పెన్నా (31) రాణించగా.. బ్రిడ్జెట్ ప్యాటర్సన్ 35 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా పోరాడింది. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠకు చేరుకోగా.. సిడ్నీ సిక్సర్స్ ఒక్క పరుగుతో గెలుపును కాపాడుకుంది. సిక్సర్స్ బౌలింగ్‌లో లారెన్ చీట్లే, అశ్లీ గార్డ్నర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కెర్, కావీమ్ బ్రే ఒక్కో వికెట్ తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు.

Asaduddin Owaisi: హనుమంతుడికి అసదుద్దీన్ ఒవైసీ హారతి వీడియో వైరల్.. కానీ..

Exit mobile version