ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి ఎక్కువ సమయమేమి లేదు. ఈ మెగా ఈవెంట్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు అమెరికా, వెస్టిండీస్ ల గడ్డపై ప్రపంచకప్ జరగబోతోంది. ఇందుకు సంబంధించి ఐసీసీ కూడా పూర్తి సన్నాహాల్లో బిజీగా ఉంది. ఇకపోతే తాజాగా, టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన కామెంటరీ ప్యానెల్ ను ప్రకటించింది ఐసీసీ. ఇందులో భారత్ నుంచి భారత మాజీ దిగ్గజ ఆటగాళ్లు హర్ష్ భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ లతో పాటు దినేష్ కార్తీక్ కూడా వ్యాఖ్యాత ప్యానెల్ లో చోటు దక్కింది.
ఇక టీ20 ప్రపంచకప్‌కు కామెంటరీ ప్యానెల్ లో వివిధ దేశాలనుంచి ఏవరెవరు ఉన్నారో చూస్తే..
* భారతదేశం నుండి హర్ష్ భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్.
* ఆస్ట్రేలియా నుండి రికీ పాంటింగ్, స్టీవెన్ స్మిత్, లీసా స్థలేకర్, ఆరోన్ ఫించ్, మాథ్యూ హేడెన్, మైక్ హెస్మాన్, టామ్ మూడీ.
* ఇంగ్లండ్ నుండి నాజర్ హుస్సేన్, అలాన్ విల్కిన్స్, ఇయాన్ వార్డ్, మైక్ అథర్టన్, ఇయాన్ మోర్గాన్, అలిసన్ మిచెల్, ఎబోనీ రెయిన్‌ఫోర్డ్-బ్రెంట్.
* దక్షిణాఫ్రికా నుండి షాన్ పొలాక్, గ్రేమ్ స్మిత్, డేల్ స్టెయిన్, నటాలీ జెర్మనోస్, కాస్ నాయుడు.
* వెస్టిండీస్ నుండి ఇయాన్ బిషప్శా, మ్యూల్ బద్రీ, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ గంగా.
* న్యూజిలాండ్ నుండి డానీ మారిసన్, సైమన్ డౌల్, ఇయాన్ స్మిత్, కేటీ మార్టిన్.
* పాకిస్థాన్ నుండి వకార్ యూనిస్, వసీం అక్రమ్, రమీజ్ రాజా.
* బంగ్లాదేశ్ నుండి అథర్ అలీ ఖాన్.
* శ్రీలంక నుండి రస్సెల్ ఆర్నాల్డ్.
* అమెరికా నుండి జేమ్స్ ఓబ్రెయిన్
* జింబాబ్వే నుండి పోమ్మీ మ్బాంగ్వా.
* నెదర్లాండ్స్ నుండి బ్రియాన్ ముర్గాట్రాయిడ్.
* ఐర్లాండ్ నుండి నియాల్ ఓబ్రియన్ లు ఉన్నారు.
All-star commentary panel 🎙
Some of the biggest names in cricket and broadcasting gather for the ICC Men's #T20WorldCup 2024 🤩https://t.co/S0a5rU5jfW
— ICC (@ICC) May 24, 2024