Elista Snowstorm Air Coolers: స్నోస్టార్మ్ విత్ స్టార్మ్ కూలింగ్.. ఎలిస్టా కొత్త ఎయిర్ కూలర్లు విడుదల.. ధర ఎంతంటే?
- ఎలిస్టా కొత్త ఎయిర్ కూలర్లు విడుదల
- స్నోస్టార్మ్ 110, స్నోస్టార్మ్ 90, స్నోస్టార్మ్ 65, స్నోస్టార్మ్ 50
- స్నోస్టార్మ్ 110 మోడల్‌ను రూ.25,999 ధరకు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలిస్టా (Elista) స్నోస్టార్మ్ (Snowstorm) సిరీస్ కొత్త ఎయిర్ కూలర్లు భారత్ లో విడుదల అయ్యాయి. ఈ సిరీస్ వేసవి వేడికి శక్తివంతమైన, ఎనర్జీ ఎఫిషియంట్ కూలింగ్ సొల్యూషన్స్ అందించడానికి రూపొందించారు. ఇది డెసర్ట్ కూలర్లు, పర్సనల్ కూలర్లను కలిగి ఉంది. ఇన్వర్టర్ కంపాటిబుల్ మోటార్లు, హై ఎయిర్ థ్రో, హనీకాంబ్ ప్యాడ్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఎలిస్టా వివిధ గది పరిమాణాలకు అనుగుణంగా స్నోస్టార్మ్ 110, స్నోస్టార్మ్ 90, స్నోస్టార్మ్ 65, స్నోస్టార్మ్ 50 అనే నాలుగు స్నోస్టార్మ్ ఎయిర్ కూలర్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
స్నోస్టార్మ్ కూలర్ల విషయానికి వస్తే, అవి అధిక గాలి ప్రవాహం, సుదీర్ఘ కూలింగ్ సైకిల్స్ కోసం రూపొందించబడ్డాయని కంపెనీ చెబుతోంది. స్నోస్టార్మ్ 110, 90, 65 సైజులు పెద్ద గదులు, కార్యాలయాలు, పాక్షికంగా తెరిచి ఉన్న ప్రదేశాలకు అనువైనవి. స్నోస్టార్మ్ 50ని పడకగదులలో ఉపయోగించవచ్చు. ఎలిస్టా స్నోస్టార్మ్ ఎయిర్ కూలర్లో మూడు వైపులా తేనెగూడు ఆకారంలో ఉండే కూలింగ్ ప్యాడ్లు ఉన్నాయి.
ఇవి మెరుగైన శీతలీకరణను అందిస్తాయి. ఇందులో ఇన్వర్టర్కు అనుకూలమైన శక్తివంతమైన మోటార్ ఉంది. విద్యుత్ హెచ్చుతగ్గుల సమయంలో కూడా ఇది సజావుగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. స్నోస్టార్మ్ ఎయిర్ కూలర్లో నీటి మట్ట సూచిక, మెరుగైన గాలి ప్రసరణ కోసం ఆటోమేటిక్ నిలువు లూవర్లు, మరింత శీతలీకరణ కోసం ఐస్ ఛాంబర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read:Railway Zone: విశాఖ రైల్వే జోన్ పనులు.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు..
స్నోస్టార్మ్ ఎయిర్ కూలర్ ధర
కంపెనీ స్నోస్టార్మ్ 110 మోడల్‌ను రూ.25,999 ధరకు విడుదల చేసింది. స్నోస్టార్మ్ 90 మోడల్‌ను రూ.13,999 ధరకు, స్నోస్టార్మ్ 65ను రూ.12,999 ధరకు, స్నోస్టార్మ్ 50ని రూ.10,999 ధరకు విడుదల చేసింది. ఈ కూలర్ల మోటార్‌కు 1 సంవత్సరం వారంటీ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. స్నోస్టార్మ్ 50 మోడల్ పంప్‌కు కూడా 18 నెలల వారంటీ వస్తుంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!