NTV Telugu Site icon

Elephant Attack: సఫారీ జీప్‌పై దాడి చేసిన ఏనుగు.. చివరకు.. వీడియో వైరల్..

Eleephant Attack

Eleephant Attack

మనలో చాలామంది ఇప్పటికే అనేక జంతు ప్రదర్శన జరిగే ప్రదేశాలకు, అలాగే కొన్ని సఫారీలలో కూడా ప్రయాణం చేసి ఉంటాము. అయితే ఒక్కోసారి సఫారీలు చేస్తున్న సమయంలో అనుకోకుండా కొన్ని ప్రమాదాలకు గురైన సంఘటనలు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో సఫారీలో భాగంగా పర్యటన పర్యటకులపై ఏనుగు దాడి చేయగా చివరి నిమిషంలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కొందరు కనపడతారు. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Boy Died: లావుగా ఉన్నాడని కొడుకుని బలవంతంగా ట్రెడ్‌మిల్‌ చేపించిన తండ్రి.. చివరకు..

ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోను గమనించినట్లయితే.. కొంతమంది పర్యాటకులు ఓ జీపులో వన్యమృగాలను సందర్శించేందుకు వెళ్లారు. సఫారీ జీవులను చూసేందుకు వెళ్లిన పర్యాటకు ఓ వింతైన అనుభవం ఏర్పడింది. అడవుల్లో ఉన్న ఓ ఏనుగుకు సఫారీ జీపులను చూసి తిక్క రేగింది. దాంతో ప్రయాణికులు ఉన్న జీపుపై ఏనుగు దాడి చేసింది. ఆ సమయంలో వాహనాన్ని కింద పడేసి ఎత్తేందుకు కూడా విఫల ప్రయత్నం చేసింది. దాంతో ఆ సమయంలో పక్కన ఉన్న మరికొందరు సందర్శకులు పెద్ద ఎత్తున అరవడంతో వాటిని గమనించిన ఏనుగు చివరి నిమిషంలో దాడి ప్రయత్నాన్ని విరమించుకొని పక్కకు వెళ్లిపోయింది.

Also Read: Tumour Removed: 16.7 కిలోల బరువున్న భారీ కణితిని తొలిగించిన వైద్యులు..

ఇకపోతే ఈ విషయం ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను చూసిన కొందరు సోషల్ మీడియా నెటిజెన్స్., జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో జరిగినట్లుగా సూచిస్తున్నారు. అప్పుడప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ లలో జరిగే సఫారీలలో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి అన్నట్లుగా ఈ వీడియో తెలుపుతోంది. ఇక ఈ వీడియో సంబంధించి కొంతమంది సోషల్ మీడియా నెటిజన్స్ కామెంట్ చేస్తూ మనం సఫారీలకు వెళ్ళినప్పుడు అధికారులు చెప్పిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసుకోవాలని., లేకపోతే ఇలాంటి ఘోరాలు జరుగుతాయని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే వీడియో చూసిన వారే ఇంతలా భయపడుతుంటే.. అక్కడ ఉన్నవారి పరిస్థితి ఏంటో అంటున్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

Show comments