Congress Schemes: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి చెందిన మరో రెండు పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీ పథకాల్లో మరో రెండు పథకాలు నేటి నుంచి అమలు కానున్నాయి. సచివాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేటి నుంచి తెలంగాణలో మరో రెండు హామీలు అమలు కానున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫారా ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. నిన్న (సోమవారం) సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి సచివాలయంలోనే కోడ్‌ను ప్రారంభించనున్నారు. గృహజ్యోతి పథకం ద్వారా రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తామన్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆమె రావడం లేదని ప్రకటించారు.
Read also: CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ సదస్సులు.. మార్చి 1వ తేదీ నుంచి 7 వరకు..?
వర్చువల్ గా ప్రియాంక గాంధీ ప్రసంగం..
కాగా.. ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని వర్చువల్ విధానంలో ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. చేవెళ్ల సభను పెద్దఎత్తున మహిళలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలో రూ.500 వంటగ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇవాళ సాయంత్రం చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో పథకాలను ప్రారంభించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే వేదిక మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు మధ్యాహ్నం సచివాలయంలో రెండు హామీ పథకాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత చేవెళ్లలో యథావిధిగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
BJP High Command: రాష్ట్రానికి మోడీ, అమిత్ షా, నడ్డా.. ఈనెల 29న తొలి జాబితా?