Site icon NTV Telugu

Election Symbols: ఎన్నికల వేళ గుర్తుల గుబులు.. టెన్షన్ లో అభ్యర్థులు

Synbols

Synbols

తెలంగాణలో నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో భారీ స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో వారికి కేటాయించే గుర్తులపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది. ఇక, ఈసీ గుర్తుల కేటాయింపులో తమకు కేటాయించిన గుర్తులను పోలిన గుర్తులను ఇవ్వొద్దని పలు పార్టీలు కోరుతున్నాయి. బీఆర్ఎస్ అంటే కారు, బీజేపీ అంటే కమలం, కాంగ్రెస్ అంటే హస్తం గుర్తులు ఓటింగ్ సమయంలో కీలకం కానున్నాయి. ఇంతటి కీలకమైన పార్టీల గుర్తులు కేటాయింపు వెనుక ఎంతో కసరత్తు నెలకొంది.

Read Also: Kartika Masa Rituals: కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు

అయితే, తమ పార్టీ గుర్తు లాంటి ఇతర గుర్తులను వేరే ఎవరికైనా కేటాయిస్తే పార్టీలు భయపడుతుంటాయి. తమకు పడే ఓట్లు వారికి పడి, ఫలితాలు తారుమారు అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో పోటీ పడుతున్న యుగ తులసి ఫౌండేషన్ గుర్తు రోడ్డు రోలర్, అలయెన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ గుర్తు చపాతీ కర్ర, కాగా.. ఇవి తమ పార్టీ గుర్తు కారును పోలి ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీంతో ఓటర్లు కంగారు పడితే తమకు నష్టం జరుగుతుందని వెంటనే ఆ గుర్తుల కేటాయింపును క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టు వరకూ బీఆర్ఎస్ పోయింది. అయితే ఈ అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది.

Read Also: IT Rides in Hyderabad: మరోసారి ఐటీ దాడులు.. బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల ఇళ్లలో సోదాలు

ఇక, గుర్తుల కేటాయింపులపై దేశ రాజకీయాల్లో కోకొల్లలు.. గుర్తింపు లేని పార్టీల కోసం ఎన్నికల కమిషన్ ముందుగానే కొన్ని గుర్తులను ఎంపిక చేసి పెడుతుంది. అయితే, అందరూ సులభంగా గుర్తించే వాటినే గుర్తులుగా ఎంపిక చేసుకుంటారు. ఉదాహరణకు.. గ్లాసు, పెన్ను. ఏనుగు, చీపురు, విజిల్ లాంటివి.. ఇక, 1990కి ముందు జంతువుల గుర్తులనూ కేటాయించేవారు.. ఎన్నికల సమయంలో సదరు జంతువులను ఊరేగిస్తుండటంతో హింస కిందకు రావడంతో జంతు ప్రేమికులు ఫిర్యాదు చేయడంతో వాటి కేటాయింపును ఈసీ ఆపేసింది. అయితే బహుజన్ సమాజ్ పార్టీకి ఏనుగు, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్కు సింహం గుర్తును కేటాయించింది.

Read Also: RBI Data: ప్రభుత్వం పై 1140శాతం పెరిగిన పెన్షన్ భారం..2022-23లో రూ.4.63లక్షల కోట్లు

అయితే, ఎన్నికల కమిషన్ కొన్ని గుర్తులను రిజర్వ్ చేసి పెట్టింది. (రిజర్వేషన్ అండ్ లాడ్ మెంట్ ఆర్డర్ 1968 కింద సీఈసీ పార్టీలకు గుర్తులు కేటాయిస్తుంది). దేశంలో 6 జాతీయ, 26 ప్రాంతీయ (గుర్తింపు పొందినవి) ఇక, 2,507 గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు స్థిరంగా ఉంటాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ దగ్గర 193 గుర్తులు ఉన్నాయి. వీటి నుంచే కొత్త పార్టీలకు, స్వతంత్రులకు గుర్తులను కేటాయిస్తుంది. తమకు కావాలనే మూడు గుర్తుల డ్రాయింగ్లను ఎన్నికల కమిషన్ కు ఇచ్చి వాటిలో ఒకదాన్ని కేటాయించమని అడగొచ్చు.. ఇలాంటి గుర్తులు ఎవరికి ఉండకపోతే, ఆ గుర్తులు వివాదాస్పదంగా లేకపోతే.. వాటిలో నుంచి ఒకదాన్ని ఎన్నికల కమిషన్ కేటాయిస్తుంది.

Exit mobile version