NTV Telugu Site icon

Election Rules: ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి చేసిన ఎన్నికల సంఘం.. నిబంధనలపై పార్టీల అసంతృప్తి..!

6

6

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అనుమతి లేకుండా ఇంటింటికి ప్రచారం చేపడితే కేసులు తప్పవని తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ అంశం సంబంధించి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు పెట్టడంతో రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ కు అభ్యంతరాలు తెలుపుతున్నాయి.

Also read: Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి..

తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిర్వహించిన సమావేశంలో ప్రచారానికి సంబంధించి 48 గంటల ముందే తమకి రూట్ మ్యాప్ అందించాలని.. అందుకు సంబంధించి అనుమతులు సువిధ యాప్ ద్వారా తీసుకోవాలని చెప్పడంతో అన్ని పార్టీలు ఈ విషయంపై అభ్యంతరాలను తెలిపాయి. ఈ విషయం సంబంధించి ఎన్నికల అధికారులు మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటా వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయడానికి, అలాగే వీధుల్లో ప్రచారం చేసుకోవడానికి 48 గంటల ముందే అనుమతి తీసుకోవాలని చెప్పగా దానికి రాజకీయ పార్టీలు ఈ నిబంధనకు సంబంధించి పునః పరిశీలించాలని విజ్ఞప్తులు చేశాయి.

Also read: Seven Police Sisters: ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసులయ్యారు.. ఆనందంలో సింగిల్ బ్రదర్

ఈ విషయం సంబంధించి ముందుగానే అనుమతి తీసుకోవాలంటే అది ఆచరణ సాధ్యం కాదని రాజకీయ పార్టీలు వెల్లడించాయి. 48 గంటల ముందే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని.. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే వాటికీ సంబంధించి అనుమతులు ఎన్నికల సంఘం మంజూరు చేస్తుందని తెలిపారు. ఆన్లైన్ లో అఫిడవిట్ నామినేషన్లను దాఖలు చేయడానికి అలాగే ముందస్తు అనుమతులు మంజూరు చేయడానికి సువిధ యాప్ ను ఈసీఐ డిజైన్ చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియచేశారు. అయితే ఈ విషయాలపై అన్ని పార్టీలు అభ్యంతరాన్ని లేవనెత్తాయి. చూడాలి మరి ఈసారి ఎన్నికలు ఎంత సజావుగా ముగుస్తాయో.