NTV Telugu Site icon

Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నిక మాజీ ఆర్వో సస్పెండ్

Munugode Bypoll

Munugode Bypoll

ప్రస్తుతం తెలంగాణ మునుగోడు మేనియా నడుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన మునుగోడు ఉప ఎన్నికలో ఎవరుగెలుస్తారనే చర్చ జరుగుతోంది. అయితే.. ఈ క్రమంలోనే మునుగోడులో ఏ చిన్న ఘటన జరిగినా అది నేషనల్‌ ఇష్యూ అవుతోంది. అయితే.. ఇటీవల తన అధికారం లేకుండానే గుర్తును మార్చిన ఎన్నికల అధికారిపై ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే ఈసీ ఈ ఘటనపై విచారణ ఆదేశించింది. ఇప్పుడు తాజాగా మునుగోడులో ఓ అభ్యర్థికి కేటాయించిన గుర్తును అధికారం లేకున్నా మార్చిన ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథరావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈసీ.

Also Read : Jhansi Telugu Review: ఝాన్సీ (వెబ్ సీరిస్)

అంతేకాకుండా.. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆయనతో పాటు ఎన్నికల అధికారికి భద్రత కల్పించడంలో విఫలమైన డీఎస్పీని సైతం క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో వెల్లడించింది ఈసీ. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తమకు తెలియజేయాలని ఎన్నికల సంఘం పేర్కొన్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్ తెలిపారు. జగన్నాథరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసి నేటి ఉదయం 11 గంటలకల్లా ఢిల్లీ పంపాలని ఆదేశించినట్టు వికాస్ రాజ్ వెల్లడించారు.