NTV Telugu Site icon

Election Code: ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల కోడ్..

Ec 1

Ec 1

Lok Sabha Elections Schedule: ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం రెడీగా ఉంది. ఎన్నికల కమినషన్ కు నిన్న ( బుధవారం ) ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్‌ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా.. సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక, బాధ్యతలు తీసుకున్న తర్వాత వారు ఎన్నికల కమిషన్ చీఫ్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కీలక భేటీలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు భేటీలోనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనపైనా ఓ క్లారిటీ రావొచ్చని సమాచారం. ఆ వెంటనే.. ఏ క్షణమైనా షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also: Bramayugam : ఓటీటీలోకి వచ్చేసిన ‘భ్రమయుగం’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఇక, ఈ ఇద్దరూ 1988 ఐఏఎస్‌ బ్యాచ్‌ కు చెందిన అధికారులు.. కేరళ రాష్ట్రానికి చెందిన జ్ఞానేశ్‌ కుమార్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సందర్భంలో జ్ఞానేశ్‌ కుమార్‌ హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించగా.. సుశ్ బీర్ సింగ్ గతంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అయితే, ఎన్నికల కమిషనర్ల ప్రకియపై ఎంపిక కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ వీరి నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై సుప్రీంలో నేడు విచారణ జరగబోతుంది.