NTV Telugu Site icon

Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..

Vote Rajya Sabha

Vote Rajya Sabha

Elections for Rajya Sabha Posts: రాజ్యసభలో ఖాళీ ఐన స్థానాలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాల్లో.. 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇకపోతే తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యత్వానికి కే.కేశవరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలలో 12 రాజ్యసభ స్థానాల ఎన్నికకు ఈనెల 14న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇక నామినేషన్ల దాఖలుకు ఆగష్టు 21 చివరి తేదీ.

Swati Maliwal case: పోలీసుల చార్జ్‌షీటులో కేజ్రీవాల్.. నిందితుడితో ఉన్నట్లు వెల్లడి

ఇక మరోవైపు బీహార్‌, హర్యానా, రాజస్థాన్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 చివరి తేదీని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక సెప్టెంబర్‌ 3న ఉదయం 9గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇక ఓటింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గం.ల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.

Balka Suman : రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది