Site icon NTV Telugu

Election Commission: ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ

01

01

Election Commission: బీహార్ ఓటర్ల ప్రత్యేక సవరణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈసమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుంది, ఆచరిస్తుందని స్పష్టం చేశారు. ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని, ఓటు చోరీ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల సంఘానికి అధికార, విపక్ష పార్టీలు సమానమని అన్నారు.

READ MORE: Rahul Gandhi: కర్ణాటకలో ఒక్కో అసెంబ్లీలో లక్షకు పైగా ఓట్లు చోరీ అయ్యాయి!

18ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందని, పౌరుల మధ్య ఈసీ విపక్ష చూపదని అన్నారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరికాదని, బీహార్ SIRలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తుపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎన్నికల సంఘం పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. బీహార్‌లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 1 వరకు సమయం ఉందని, తమ బాధ్యత నుంచి వెనక్కి వెళ్లలేదని వెల్లడించారు. తమపై చేస్తున్న తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదుని, ప్రతిపక్షాలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నాయని అన్నారు.

ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి లోపాలను తొలగించడంలో ఓటర్లు, రాజకీయ పార్టీల నాయకులు తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. ముసాయిదా జాబితాలోని క్లెయిమ్‌లు, అభ్యంతరాల సమయం ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉందని, గడువు తీరడానికి ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉన్నాయి తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలోని లోపాలను అన్ని రాజకీయ పార్టీలు ఫారమ్ కింద సమర్పించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ద్వారాలు అందరికీ సమానంగా తెరిచి ఉన్నాయని స్పష్టం చేశారు.

జిల్లా అధ్యక్షుడు, బీఎల్‌ఏల ధృవీకరణ జాతీయ పార్టీకి చేరకపోవడం, గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించడం ఆందోళన కలిగించే విషయని అన్నారు. బీహార్‌లోని 7 కోట్లకు పైగా ఓటర్లు ఎన్నికల కమిషన్‌కు మద్దతు ఇస్తే, ఈసీ విశ్వసనీయతను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలో మెరుగుదల కోరుతున్నాయని, ఈ డిమాండ్‌ను నెరవేర్చడానికి బీహార్ నుంచి SIR ప్రారంభించినట్లు తెలిపారు. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తప్ప మరే ఇతర అంశంపైనా ఎన్నికల కమిషన్ అధికారికంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అనేది జరగదు. కానీ ఈ రోజు ఈసీ మొదటి సారి సమావేశం నిర్వహించింది.

READ MORE: Hyderabad :కార్మికుల సమ్మెపై చిరంజీవితో నిర్మాత సి.కల్యాణ్ కీలక చర్చ!

Exit mobile version