NTV Telugu Site icon

Election Commission: ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు రంగుపడుద్ది..

Election Commission

Election Commission

Election Commission: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేసేందుకు వచ్చే సహాయకుల కుడి చేతి వేలిపై సిరా గుర్తును వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వికలాంగులు లేదా వృద్ధులను ఓటు వేసేందుకు తీసుకొచ్చే సహాయకుల కుడి చేతి చూపుడు వేలికి ఇంక్ గుర్తు పెట్టాలని నిర్ణయించారు. బూత్, ఓటు.. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఓటరు ఎడమవైపు చూపుడు వేలుపై సిరా గుర్తు ఉంటుంది. ఓటర్ల సహాయకులుగా వచ్చిన వారి కుడిచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు ఉంటుంది. మరోవైపు మాక్ పోలింగ్ ఉదయం 5.30 గంటలకు ప్రారంభించాలని ఎన్నికల సంఘం సూచించింది. అయితే పోలింగ్‌ కేంద్రాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చునే అవకాశం ఎన్నికల కమిషన్‌ కల్పించింది.

తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెల 9వ తేదీన ఎన్నికల కార్యక్రమం విడుదలైంది. తెలంగాణతో పాటు మరో నాలుగు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నగదు పట్టుబడినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కార్యక్రమం విడుదలైన తేదీ నుండి నిన్నటి వరకు సుమారు. 500 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన సర్టిఫికెట్ లేకపోవడంతో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ కృతనిశ్చయంతో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంది. కర్ణాటకలో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ అదే ఫార్ములాను అనుసరించాలని భావిస్తోంది.
Chennai: పార్టీ చేసుకున్నందుకు మహిళలు, పురుషులు అరెస్ట్.. అసలేం జరిగింది..?