Site icon NTV Telugu

Election Commission: ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి ఈసీ గ్రీన్ సిగ్నల్

Ec

Ec

ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. ఈపీఐసీ (EPIC)ని ఆధార్‌తో అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. త్వరలో యుఐడీఏఐ(UIDAI), కేంద్ర ఎన్నికల సంఘం నిపుణుల మధ్య సాంకేతిక సంప్రదింపులు ప్రారంభం కానున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్, ఈసీలు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు డాక్టర్ వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, యుఐడీఏఐ(UIDAI), కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక నిపుణులు నేడు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్ సదన్ లో భేటీ అయ్యారు.

READ MORE: Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్కి ఆమోదం తెలిపే ఛాన్స్

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వబడుతుంది. ఆధార్ కార్డు ఒక వ్యక్తి గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం1950లోని సెక్షన్ 23(4), 23(5), 23(6)లోని నిబంధనల ప్రకారం.. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మాత్రమే జరుగుతుందని నిర్ణయించారు. యుఐడీఏఐ(UIDAI), కేంద్ర ఎన్నికల సంఘం కలిసి త్వరలో ముందడుగు వేయనుంది.

Exit mobile version