NTV Telugu Site icon

Manoj- Lakshmi: మనోజ్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. షాక్ కి గురైన యంగ్ హీరో (వీడియో)

Manoj

Manoj

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఈ బిడ్డకు అన్న ప్రసన్న జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ సోదరి మంచు లక్ష్మి తన తమ్ముడికి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మంచు లక్ష్మి తన కూతురు యాపిల్‌ను మనోజ్‌కు తెలియకుండా కార్యక్రమానికి తీసుకెళ్లింది. తన కోడలిని చూసిన మనోజ్ ఒక్కసారిగా సంతోషానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి షేర్ చేస్తూ.. ‘ఇది చాలా అందమైన రోజు.. నా హృదయం ప్రేమ, కృతజ్ఞతతో నిండింది. నా స్వీట్ చిన్న మేనకోడలు అన్న ప్రసన్న కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంది. హిందువులుగా మనం ఆచరించే ఈ సంప్రదాయాలలో నిజంగా ప్రత్యేకత ఉంది.” అని పేర్కొంది.

READ MORE: Maharashtra: దారుణం.. 10 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..

“కొత్త ప్రారంభాలు, మైలురాళ్లను గుర్తించడం, జీవిత సౌందర్యాన్ని కలిసి జరుపుకోవడం ఇదోక ప్రత్యేక అనుభూతినిస్తుంది. యాపిల్‌(కుమార్తె) ను చూడగానే మనోజ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ సంతోషం వెలకట్ట లేనిది. నాకు కుటుంబం, స్నేహితులతో లాంటి మంచి వ్యక్తులు నాకు తోడుగా ఉన్నారు. నేన్ను నేడు వాళ్లు ఆశీర్వదించారు. ఇలాంటి మంచి అనుభూతిని కలిగించిన యాత్రను ఆహ్లాదకరంగా చేసినందుకు నేను దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గణేశుడు నా చిన్న మేనకోడలు దేవసేనను ఎప్పుడూ రక్షిస్తాడు.. ప్రేమ, సంరక్షణతో నిండిన ఇలాంటి క్షణాలు ఓ అత్తగా నా హృదయంలో నిండాయి.” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.

Show comments