Site icon NTV Telugu

Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ కూల్చివేత ? ప్రపంచ వింత మాయం కానుందా!

Eiffel Tower Demolition

Eiffel Tower Demolition

Eiffel Tower Demolition: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటని అనుకుంటున్నారు.. ఈఫిల్ టవర్ కూల్చివేత.. ఫ్రెంచ్ ప్రభుత్వం 2026 లో ఈఫిల్ టవర్‌ను కూల్చివేయబోతోందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. టవర్ “లీజు గడువు ముగిసింది, అధిక నిర్వహణ ఖర్చులు, బలహీనమైన నిర్మాణం” కారణంగా దానిని కూల్చివేస్తారని చెబుతున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఎంత అనేది .. ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Boy Rides Crocodile: అరెయ్ బుడ్డోడా.. అది గుర్రం అనుకున్నావా.. అలా చేస్తున్నావ్..

వార్తలో నిజం ఎంత..
ఈఫిల్ టవర్ కూల్చివేతపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజం ఎంత వరకు ఉందో తెలుసా.. ఈ వార్త పూర్తి అవాస్తవం అని పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ పుకారు సెప్టెంబర్ 18, 2025న హాస్యం, పేరడీ కంటెంట్‌కు పేరుగాంచిన “టాపియోకా టైమ్స్” వెబ్‌సైట్‌లో ప్రచురించిన వ్యంగ్య కథనంతో ప్రారంభమైంది. ఇంతకీ ఈ వైబ్‌సైట్‌లో ఈఫిల్ టవర్ గురించి ఏమని కథనం వచ్చిందో తెలుసా.. “ఈఫిల్ టవర్ ఇప్పుడు ఖాళీగా ఉంది, దానిని ఎవరూ సందర్శించడం లేదు, కాబట్టి దానిని కూల్చివేస్తారు” అని సరదాగా రాసింది.

ఈ వెబ్ సైట్‌ తన వ్యాసంలో.. దానిని కూల్చివేసి దాని స్థానంలో కొత్తదాన్ని ఉంచుతామని పేర్కొంది. టవర్‌ను ఉడుతలు, పావురాలు ఆక్రమించాయని, భవిష్యత్తులో దాని స్థానంలో “వాటర్ స్లయిడ్, కచేరీ హాల్ లేదా పారిస్ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్” ఏర్పాటు చేయవచ్చని కూడా ఇది సరదాగా పేర్కొంది. కథనం చివరి పంక్తిలో ఇది “2026 ప్రారంభంలో ప్రారంభమవుతుంది” అని పేర్కొంది. ఈ వార్త ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. చాలా మంది వినియోగదారులు దీనిని ఫ్యాక్ట్ చేయకుండా ఇది నిజమని నమ్ముతున్నారు. వాస్తవానికి ఇది ఒక అవాస్తవ, సరదా కథనం.

తాత్కాలికంగా ఈఫిల్ టవర్‌ మూసివేత..
వైరల్ పోస్ట్‌తో పాటు, కొంతమంది టవర్ మూసివేసిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. ఇది ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తోంది. వాస్తవానికి ఫ్రాన్స్‌లో ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలని, సంపన్నులపై పన్నులు పెంచాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న కార్మికులు సమ్మె కారణంగా అక్టోబర్ 2, 2025 నుంచి ఈఫిల్ టవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఇలాంటి సమ్మెలు గతంలో కూడా జరిగాయి. 2023లో కూడా ఈఫిల్ టవర్ కొన్ని రోజులు మూసివేశారు.

అధికారిక ప్రకటన రాలేదు..
పలు అంతర్జాతీయ పత్రికల కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌లో ఈఫిల్ టవర్‌ను నిర్వహించే సంస్థ దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పారిస్ నగర మండలి లేదా ఫ్రెంచ్ హెరిటేజ్ అధికారులు టవర్ కూల్చివేత గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే అత్యంత భారీగా నిర్వహిస్తున్న, రక్షిత స్మారక చిహ్నాలలో ఒకటి. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఈ ఈఫిల్ టవర్ కూడా ఒకటి. ఈ ఐకానిక్ స్మారక చిహ్నం మరో వంద సంవత్సరాలు నిలిచి ఉండేలా చూసుకోవడానికి ప్రతి ఏడాది మిలియన్ల యూరోలు దానిని శుభ్రపరచడం, పెయింటింగ్ చేయడం, మరమ్మత్తులు చేపట్టడానికి ఖర్చు చేస్తున్నారు.

READ ALSO: Chidambaram Controversy: సొంత పార్టీ ఆగ్రహానికి గురైన చిదంబరం.. ఆపరేషన్ బ్లూ స్టార్‌పై ఏం మాట్లాడారంటే!

Exit mobile version