యంగ్ హీరో త్రిగుణ్, గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఇప్పటికే తన టీజర్లతో ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. భయపెట్టే విజువల్స్.. సస్పెన్స్ డైలాగులు.. ట్రైలర్ ప్రారంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠంగా అనిపించాయి. ముఖ్యంగా, ‘మీరు ఇప్పటి వరకు చూడని, ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది’ అనే డైలాగ్ ప్రేక్షకుల్లో ఒక రకమైన భయాన్ని, కుతూహలాన్ని కలిగిస్తోంది.
Also Read : Krithi Shetty : ఆ హీరోతో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది..
శవాలు వాటంతట అవే కదలడం, చీకటి గదిలో వింత శబ్దాలు మరియు అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. హెబ్బా పటేల్ ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ హారర్ ఎలిమెంట్స్‌కు గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ తోడు చేసింది. ఇక షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఈషా’, డిసెంబరు 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. విభిన్నమైన కథాంశంతో, మనుషులకు తెలియని మరో చీకటి ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో భయపెడుతుందో చూడాలి. హారర్ చిత్రాల ప్రియులకు ఈ డిసెంబర్ ఒక సాలిడ్ ట్రీట్ ఇవ్వబోతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
