ప్రముఖ అభరణాల షోరూం వేగ జ్యుయలర్స్ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అయితే.. ఈ నేపథ్యంలో విజయవాడలోని వేగ జ్యుయలర్స్ వేడుకల్లో సినీనటి ఈషా రెబ్బా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి ఈషా రెబ్బా వేగ జ్యుయలర్స్ మొదటి వార్షికోత్సవ లక్కీ డ్రా పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తమను ఆదరించి, విశ్వసించి విజయాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సంస్థ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ శుభ తరుణంలో తమను ప్రోత్సహిస్తున్న ఖాతాదారులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు. బంగారు/వజ్రాభరణాల తయారీ/తరుగు చార్జీల పైన 50శాతం వరకు తగ్గింపు, వజ్రాభరణాలు క్యారట్ ధర రూ.54,000 మాత్రమేనని తెలిపారు. పోల్కీ జ్యుయలరీ పై ఎలాంటి తయారీ/తరుగు చార్జీలు ఉండబోవని ఈ సందర్భంగా నవీన్, సుధాకర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా ఈ ఆఫర్ సమయంలో తమ షోరూంకు వచ్చిన ఖాతాదారులకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని, ఈ నెల 19 సాయంత్రం 6 గంటలకు డ్రా తీస్తామని ప్రకటించారు.
Vega jewellery : వేగ జ్యుయలర్స్ లక్కీ డ్రా పోస్టర్ లాంచ్ చేసిన ఈషా రెబ్బా

Eesha 1