Site icon NTV Telugu

Free Tablet Scheme: విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా!

Free Tablet

Free Tablet

Free Tablet Scheme: విద్యార్థులను ఉచితంగా టాబ్లెట్లు అందజేస్తున్నారు. మీకు తెలుసా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి కొత్త పథకాలను అమలు చేస్తోంది. చిన్నారులను చదువుతో పాటు సాంకేతికతతో అనుసంధానించడం నేటి కాలంలో కీలకమైన అవసరంగా మారింది. దీనికి అనుగుణంగా, యూపీ సర్కార్ విద్యార్థులకు ఉచిత టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను అందించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇంతకీ ఆ పథకం ఏంటి, దాని స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

READ ALSO: MG Windsor EV: 2025 లో ఎలక్ట్రిక్ కింగ్‌గా నిలిచిన ఎంజీ విండ్సర్ EV.. మిడిల్ క్లాస్ కి బెస్ట్ ఆప్షన్..

యూపీ సర్కార్ ఈ పథకం ద్వారా యువతను ఆన్‌లైన్ విద్య, డిజిటల్ నైపుణ్యాలు, కొత్త ఉపాధి అవకాశాలతో అనుసంధానించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డిజిశక్తి పథకాన్ని స్టార్ చేసింది. డిజిటల్ ఇండియా మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడం, రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఈ పథకంలో భాగంగా, సాంకేతిక, వైద్య, నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, విశ్వవిద్యాలయాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు అందించనున్నారు.

ఈ పథకంలో 6.8 మిలియన్లకు పైగా విద్యార్థులను అనుసంధానించాలని యూపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ప్రయోజనం పొందుతారని అధికారులు వెల్లడించారు. ఈ టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులను సులభంగా యాక్సెస్ చేయగలరు. అలాగే ఇ-లెర్నింగ్ కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు, డిజిటల్ నోట్స్ తీసుకోగలరు, పోటీ పరీక్షలకు సిద్ధం కాగలరు. వీటి ద్వారా విద్యార్థులు కొత్త సాంకేతికతలు, డిజిటల్ నైపుణ్యాలను కూడా నేర్చుకోగలుగుతారు, ఇది వారి భవిష్యత్తు ఉపాధి అవకాశాలను పెంచుతుందని అధికారులు తెలిపారు.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
డిజిశక్తి పథకానికి విద్యార్థులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రక్రియ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా నిర్వహించనున్నారు. అనంతరం సంబంధిత సంస్థలు అర్హత కలిగిన విద్యార్థుల డేటాను డిజిశక్తి పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తాయి. ఈ డేటా ధృవీకరించిన తర్వాత, విద్యార్థులు digishakti.up.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, e-KYCని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ విద్యార్థి డేటా అయిన తప్పుగా ఉంటే, వారు తమ కళాశాల నోడల్ అధికారిని సంప్రదించవచ్చు. మొత్తం ప్రక్రియలో విద్యార్థులు లాగిన్ IDని సృష్టించాల్సిన అవసరం లేదు. విద్యార్థులు తమ టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ స్థితికి సంబంధించిన సమాచారాన్ని SMS ద్వారా అందుకుంటారు. ఈ విధంగా డిజిశక్తి పథకం ఉత్తరప్రదేశ్‌లోని విద్యార్థులను డిజిటల్‌గా శక్తివంతం చేస్తోందని, విద్య, కెరీర్ అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Mana Shankara Vara Prasad Garu Trailer: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ చూశారా!

Exit mobile version