NTV Telugu Site icon

UP Teacher: టీచర్ దెబ్బకి మూతబడిన స్కూల్.. దర్యాప్తు చేస్తున్న అధికారులు

Up Teacher

Up Teacher

Uttara Pradesh School Closed: ఉత్తరప్రదేశ్ లో రెండో తరగతి చదువున్న ముస్లిం విద్యార్థిని ఓ టీచర్ ఇతర పిల్లలతో కొట్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఎక్కాలు సరిగా చెప్పలేదని తోటి విద్యార్థులతో కొట్టించినట్లు టీచర్ తెలిపింది. అయితే ఆమె అసభ్యంగా మాట్లాడిన మాటలు, మతం గురించి ప్రస్తావించడం వీడియోలో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఈ వీడియో వివాదాస్పదంగా మారింది.  దీనిపై విద్యాశాఖ స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు సందర్భంగా కూడా ఆ టీచర్ తాను చేసిన పని పట్ల సిగ్గుగా ఫీల్ అవడం లేదంటూ పేర్కొనడం గమనార్హం. ఇక ఇలా చిన్న చిన్న విషయాలను కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తాము పని చేయడం కష్టమని, చిన్నప్పటి నుంచే పిల్లలకు భయం పెట్టాలని కూడా ఆ టీచర్ పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలను కొడితేనే వారికి భయం ఉంటుందని ఆమె మాట్లాడారు.

Also Read: Donald Trump: ట్రంప్ తో అట్లుంటది మరి..కాసులు వర్షం కురిపిస్తున్న మగ్ షాట్

ఇక దర్యాప్తు ప్రారంభించిన విద్యాశాఖ ఘటన జరిగిన నేహా పబ్లిక్ స్కూల్ మూసివేయాలని ఆదేశాలు జారిచేసింది. స్కూల్ గుర్తింపును రద్దు చేసినట్లు ప్రాధమిక విద్యాధికారి తెలిపారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 50 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే స్కూల్ గుర్తింపు రద్దు చేయడంతో వారిని వేరే చోట సర్థుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక ఈ ఘటన బాలుడి మానసిక పరిస్థితిపై దారుణంగా ప్రభావం చూపింది. బాలుడు రాత్రిపూట సరిగా నిద్రపోకపోవడంతో ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలయ్యాడు.  ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ త్రిపాఠి త్యాగిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇకనైనా స్కూల్ టీచర్లు విద్యా్ర్థుుల పట్ల వ్యవహరించే తీరు మార్చుకోవాలని ఏ మాత్రం పొరపాటు జరిగిన స్కూల్ లైసెన్స్ రద్దు చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఘటన ఎక్కడ మత విద్వేషాలకు దారి తీస్తుందో అని భావించిన అధికారులు వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడకూడదని పిల్లవాడి తండ్రితో స్కూల్ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకుంది. అయితే వీడియో వైరల్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.