Pithapuram: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హీట్ పెంచుతున్నారు.. ఇక, పిఠాపురం.. ఏపీలో హాట్ సీట్. కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుంటే.. వైసీపీ నుంచి ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. ఇప్పుడు ఊహించని వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు. పోటీకి తాను సై అంటూ బరిలోకి దిగాడు.. అయితే, నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మే 13 పోలింగ్, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అయితే, పవన్ కల్యాణ్ పోటీలో ఉండటంతో.. అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై పడింది. అయితే.. పవన్ కల్యాణ్‌ను మించి అటెన్షన్ గ్రాబ్ చేశాడో సామాన్యుడు. నామినేషన్లు వేసిన వారిలో ఏడిద భాస్కర్‌రావు ఉన్నాడని వినిపించగానే.. ఎవరాయన అంటూ ఆరా తీయడం ప్రారంభించారు.
Read Also: US: పాలస్తీనా అనుకూల నిరసనలపై ఉక్కుపాదం.. 200 మంది అరెస్ట్
ఇంతకీ పిఠాపురంలోకి అనూహ్యంగా తెరపైకి వచ్చిన భాస్కర్‌రావు ఎవరు..? అంటే.. చెప్పులు కుట్టుకునే సాధారణ వ్యక్తి. పిఠాపురానికి చెందిన ఏడిద భాస్కరరావు డిగ్రీలో పొలిటికల్ సైన్స్ చదివారు. ఉద్యోగాలు కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు పాదరక్షలు కుట్టే పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తనలా చదువుకుని ఉద్యోగాలు లభించక.. నిరుద్యోగులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతీ యువకుల కష్టాలను అందరికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారాయన. స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుట్టకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకవైపు చెప్పులు కూడుతూనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు తన చదువు కొనసాగించారు. చెప్పులు కుట్టుకుంటూనే అమెరికా ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన అబ్రహాం లింకన్‌ను ఆదర్శంగా తీసుకున్న భాస్కర్‌రావు.. స్థానికుడిగా తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు. నియోజకవర్గంలోని సమస్యలేంటి.. వాటి పరిష్కార మార్గాలేంటి సూచిస్తూ.. రాసినవాటినే మేనిఫెస్టోగా చూపిస్తున్నారు భాస్కర్‌రావు. తాను కరెక్ట్ అనిపిస్తే.. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.